వీఆర్ఏలపై సీసీఎల్ఏ మొండి వైఖరి వద్దు

శివ్వంపేట జూలై  జనంసాక్షి :
గ్రామాలలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులపై సీసీఎల్ఏ అవలంభిస్తున్న మొండి వైఖరి వీడానాడాలని డిమాండ్ చేస్తూ  వీఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం  మండల వీఅర్ఏలు అందరూ మండల కేంద్రమైన శివ్వంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏలకు సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, వీఆర్ఏలపై సీసీఎల్ ఏ మొండి వైఖరి ప్రధాశించవద్దని, వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అద్యక్షులు గుండె బాలయ్య, ఉపాధ్యక్షులు రాజీపేట సత్తయ్య, ప్రధాన కార్యదర్శి మహేష్ లు మాట్లడుతూ వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఅర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సారాలు వయస్సు గల వీఆర్ఏల స్థానంలోనే వారి కుటుంబ  వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేపడుతామని వారు హెచ్చరించారు. అనంతరం డిమాండ్ లతో ఉన్న వినతిపత్రాన్ని ఎస్ఐ రవికాంత్ రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల సహాయ కార్యదర్శి నీరుడి దశరథ, కోశాధికారి నర్సింగరావు, కార్యవర్గ సభ్యులు మస్కురి యాదమ్మ, బొంతపల్లి సునీత, షేక్ మోహినోద్దిన్, బొల్లు యాదయ్య, తాడేపు నాగభూషణం, మస్కురి భి క్షపతి, తదితరులు పాల్గొన్నారు.