వీఆర్ఏ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఎ లకు నెలకు 15000 రూ ‘ పెన్షన్ మంజూరు చేయాలి.
– దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
దుబ్బాక 29, జూలై ( జనం సాక్షి )
రాష్ట్రంలో వీఆర్ఏ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేపట్టగా వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 9 సెప్టెంబర్ 2020 న కేసీఆర్ వీఆర్ఎస్ఐ లను రెగ్యులరైజేషన్ చేస్తానని , వీఆర్ఎలకు పే స్కేల్ జీవో అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీహామీ నెరవేర్చకపోగా దాని ఊసే ఎత్తకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని ధ్వజమెత్తారు . ఉద్యోగస్తుల , నిరుద్యోగుల, వీఆర్ఎల సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని , పే స్కేల్ జీవోను విడుదల చేసి అమలు చేయాలని అలాగే 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఎ లకు నెలకు 15000 రూ ‘ పెన్షన్ మంజూరు చేయాలని , అర్హులైన వారికి వారసత్వం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . ప్రస్తుతం వీఆర్ఎల జీతాలు పెరుగుతున్న నిత్యవసర ధరల అనుగుణంగా నెలకు 25 వేల రూపాయలు పెంచి ఇవ్వాలని , అర్హత కలిగిన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు నర్మేట యేసురెడ్డి, యూత్ అధ్యక్షులు ఆకులభారత్,రాష్ట్ర నాయకులు విజయపాల్ రెడ్డి, ముద్దుల శ్రీనివాస్ రెడ్డి, బస మధు,బూరని శ్రీకాంత్, బొమ్మరి శ్రీధర్,ఉషయ్యగారి రాజిరెడ్డి, చంద్రం,కిషన్,మల్లేశం విఆర్ఏ సంఘ మండల అధ్యక్షులు షాఢ రాజు, వెంకట్,హకీమ్,బాపురెడ్డి,రాజు, మడబోయిన రాజు,అసిఫ్,ఆయా గ్రామాల విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు .