వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి…
వైస్ ఎంపీపీ రమేష్…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 10
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో యువత మహిళలు ముందుకు సాగాలని శంకరపట్నం వైస్ ఎంపీపీ పులికోట రమేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం మండలాధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైసీపీ, ప్రజా ప్రతినిధులు , మాజీ ప్రజా ప్రతినిధులు,ప్రజాసంఘాల నాయకులు రజక సంఘం మండల, గ్రామాల నాయకులు, వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం చాకలి కులములో పుట్టిన వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ పోరాట ఫలితంగానే తెలంగాణలో భూ సంస్కరణలు జరిగాయని గుర్తు చేశారు. ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని యువత, యువతి, యువకులు, మహిళలు ముందుకు సాగి ఐలమ్మ పోరాటపటిమను అవలంబించుకొని, ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు గజ్జలి హనుమంతు, టీఆర్ఎస్ నాయకులు బోజ్జ కోటిలింగం, మండల అధ్యక్షుడు తాడిచర్ల తిరుపతి, నియోజకవర్గం ఇన్చార్జి నాంపల్లి శంకరయ్య, ఐలమ్మ విగ్రహ ఉత్సవ కమిటీ చైర్మన్ కల్లేపల్లి క్రాంతి కుమార్, సీనియర్ జర్నలిస్టు ప్రజాసంఘాల నాయకులు కొరిమి వెంకటస్వామి, శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ,సీనియర్ జర్నలిస్ట్ దండు సమ్మయ్య, రజక సంఘం నాయకులు రాస మల్ల శ్రీనివాస్ నేరెళ్ల సంతోష్ కుమార్, పాండ్రాల శ్రీనివాస్, రాజయ్య, కొమురయ్య, శ్రీనివాస్, మొగిలి, వివిధ గ్రామాల రజక సంఘం నాయకులు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు