వీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరంవీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరం
యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
ఆర్జీ-2 ఏరియా వకిల్ పల్లి గనికి సంబంధించి జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని రేమేడియేషన్ మేజర్స్ క్రింద వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడంలో భాగంగా వీర్లపల్లి ప్రభావిత గ్రామములో గురువారం ఆర్జీ-2 ఏరియా సింగరేణి యాజమాన్యం ఆద్వర్యంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏరియా ఎస్ఓటుజిఎం అబ్దుల్ సలీం ముఖ్య అతిధిగా హాజరై వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. పరిసర ప్రభావిత గ్రామాలకు మెడికల్ క్యాంప్ ద్వారా వైద్య పరిక్షలు నిర్వహించి నివారణకు మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఓటుజిఎం కోరారు. ఈ వైద్యశిభిరంలో 103 మంది గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వహించి నివారణకు మందులు ఇవ్వడం జరిగిందని ఎస్ఓటుజీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, గ్రామ పరిరక్షణ కమిటి అధ్యక్షులు వేణుగోపాల్ రావు, డిజిఎం పర్సనల్ జి.రాజేంద్ర ప్రసాద్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డా.మహిపాల్, డా. పి. ఆదినారాయణ, సంక్షేమాదికారి ఓంకారి బాబు తదితరులు పాల్గొన్నారు.