వెనుకబడిన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు

 

 

 

 

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్
చౌడాపూర్,సెప్టెంబర్ 3( జనం సాక్షి):వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకస్మికంగా తనిఖీ  చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ..చదువుకు ఆమడ దూరంలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రభుత్వ హాస్టళ్లను మరియు ట్రైబల్ వెల్ఫేర్స్,సోషల్ వెల్ఫేర్స్ అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూళ్లను ప్రారంభించి వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రభుత్వ హాస్టల్ ను ప్రారంభిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వెనుకబడిన వర్గాల హాస్టల్ లపై చిన్న చూపు చూస్తూ,విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతూ,సరైన పరిశుభ్రత లేకుండా చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ,వెనకబడిన వర్గాల విద్యార్థులను మళ్లీ వెనకకి నెట్టివేయాలని చూస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్ అన్నారు.ఇలాగే ప్రభుత్వ హాస్టల్ లపై చిన్న చూపు చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వాన్నికి కచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మరియు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా స్థానిక అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకుండా, విద్యార్థులకు న్యాయం చేయకపోతే,లేనియెడలా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్,ఎస్టీసెల్ అధ్యక్షుడు శివరాం నాయక్ ,దామోదర్ రెడ్డి,సలీం వెంకటేష్ గౌడ్,రవి నాయక్,రాములు,చెన్నయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.