వేడుకగా తిరుమల బ్ర¬్మత్సవాలు

చిన శేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): తిరుమల శ్రీనివాసుని బ్ర¬్మత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు ఉదయం స్వామివారు ఐదు పడగల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడి రూపంలో చిన్న శేషవాహనంపై ఆసీనులైన వేంకటేశ్వరుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామివారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వివిధ రాష్ట్రాల  నుంచి వచ్చిన కళాకారులతో మాడవీధులు కోలాహలంగా మారాయి. భజనలు, కోలాటాలు, హరినామ సంకీర్తనలు, కేరళ వాయిద్యాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవల ముందు భక్తుల కోలాటాలు, సంగీత నృత్యాలు చేస్తూ స్వామిని కొలుస్తూ కదిలారు. మాడవీధుల్లో వెళుతుంటే అంతా స్వామిని తదేకంగా చూస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

తాజావార్తలు