…….,…వేములకొండనునూతన మండల కేంద్రంగా ప్రకటించాలి:అఖిలపక్షం నాయకులు……………
జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 18:మండల పరిధిలోని వేములకొండ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు అన్నారు.ఆదివారం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో 58వ రోజు దీక్ష చేపట్టి వారు మాట్లాడుతూ వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని వేములకొండ గ్రామంలో మండలానికి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని రెవెన్యూ పరిధి భూమి కూడా కలదని మండలంగా ప్రకటిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రాకపోకలకు సౌకర్యం అందుబాటులో ఉంటుందని,వేములకొండ గ్రామంలో యూనియన్ బ్యాంక్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ప్రైమరీ ఉన్నత పాఠశాల,జిల్లా పరిషత్ హైస్కూల్,అంగన్వాడి కేంద్రాలు 3 ఉన్నాయని,33 కెవి సబ్ స్టేషన్,బిఎస్ఎన్ఎల్ టవర్,ఐడియా టవర్,ఎయిర్టెల్ టవర్,జియో టవర్,వెటర్నరీ హాస్పిటల్,గ్రంథాలయ భవనం,పిఎసిఎస్ భవనం,2 కమ్యూనిటి హాల్,పాల ఉత్పత్తి కేంద్రం,ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయోధ్యరామస్వామి వారి దేవస్థానం కలదని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,అఖిలపక్షం నాయకులు వివిధ గ్రామాల,మహిళలు కోలాటాలతో నిరసన తెలిపారు గ్రామాల ప్రజలు,యువకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.