వైద్యకళాశాలపై విస్పష్ట ప్రకటన చేయండి

– పొన్నం డిమాండ్‌

కరీంనగర్‌, ఆగష్టు 18(జనంసాక్షి):తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా ప్రజలకు మూడెల్ల క్రితం స్పష్టంగా ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నానని ప్రకటించిన దానిని అమలు చేసేవిషయంలో ప్రభుత్వం బేషజాలకు పోయి, పోలీస్‌లను ప్రయోగించి ఉక్కుపాదం మోపినా జిల్లాకు వైద్యకళాశాల సాదించేవరకుతమతో కలిసివచ్చేపార్టీలు ప్రజాసంఘాలతో కలిసి పోరాటం చేసి తీరుతామని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహంలో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి విూడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా పొన్నంమాట్లాడుతూ వైద్య కళాశాల విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రి వంకర టింకరగా సమాదానం ఇవ్వడంమానుకుని జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల కావాలా ? వద్దా ?అనే అంశంపైస్పష్టంగా జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిజంగానే మంత్రి టీఆర్‌ఎస్‌ చెప్తున్నట్లుగ కిరణ్‌ కుమార్‌ రెడ్డి రిజెక్ట్‌ చేసినట్లు ఎక్కడన్నా ఫైల్‌ఉంటే బహిర్గతంచేయాలని డిమాండ్‌ చేశా రు. రెండు ప్రైవేట్‌ వైద్యకళాశాలలున్నాయి కాబట్టికరీంనగర్‌లో వయొబిలిటీలేదని చెప్పే ఆర్థిక మంత్రి ఒసారి పాండిచ్చేరికి వెల్లి చూసి రావాలని హితవు పలికారు,. కిరణ్‌కుమార్‌ రెడ్డి వద్దన్నాడనిఅన్నా, విూ ముఖ్యమంత్రికి సోయిలేకుండానే ఆతర్వాత మంజూరు చేశాడాఅని నిలదీశారు. తనను తిట్టడానికి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టుకుంటే పెట్టుకోండి కాని జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల అవసరమా కాదా, ఇస్తాన ని హామిఇచ్చింది విూముఖ్యమంత్రి కాబట్టి ఇస్తరా ఇవ్వ రా స్పష్టంచేయాలని ఆయనసవాల్‌ విసిరారు.కరీంనగర్‌ మెడికల్‌ కళాశాల డిమాం డ్‌తో ఆందోళ న చేయగానేకొందరు జగిత్యాలలో, పెద్దపల్లిలో కావాలని దర్నాలు చేయడం, టీఆర్‌ఎస్‌ నాయక త్వం హైదరాబాద్‌నుంచి సిద్దిపేటకువ్యతిరేకమా. మహబూబ్‌నగర్‌కు వ్యతిరేకమా అని ప్రశ్న లు సందించితప్పుదారిపట్టించే ప్రయత్నంచేయడం దారుణమన్నారు. రాష్ట్రంలోని31జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకళాశాలలురావాలని ఆశిస్తున్నానని, ఇవ్వాలని కూడాడిమాండ్‌చేస్తున్నానన్నారు. జిల్లా లో మెడికల్‌ క ళాశాల ఏర్పాటుపైఆందోళనలు కొనసాగుతాయని,కాంగ్రెస్‌హైకమాండ్‌ ప్రభుత్వా నికి విదించిన మూడునెలల గడువుతర్వాత ఖచ్చితం గా కలిసివచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తుంటేవద్దని దర్నాలు చేయాలని వక్రమార్గంలో పయనింపచేయడమేకాక, దర్నాలు చేయాలని, రోడ్డెక్కాలని స్వయంగా మంత్రి పిలుపునివ్వడం దేనికి సంకేత మని ఆయన కేటీఆర్‌ను నిలదీశారు. 24 గంటల విద్యుత్‌ వద్దనే వారు ఎవరైనా ఉం టారా…? ప్రజలకు మెరుగైన మార్గాలు చూపించాలే తప్ప వారిని ఆందోళనలవైపు మల్లించడం తగునా అన్నారు. ప్రజాసమస్యలు, అవసరాలకోసం ఆందోళనలు, నిరాహార దీక్షలుచేస్తే బల వంతంగా పోలీస్‌లను ఉసిగొల్పి ఉక్కుపాదం మోపి అరెస్ట్‌ చేయించడం ఎంతవరకు సమంజసమని మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు. సమై క్యజిల్లాలో తనతోకలిసి ప్రజాప్రతినిధిగా వ్యవహరించినమంత్రి కేటీఆర్‌ గుండుసూది గుచ్చుకుందంటేనే ట్విట్టర్‌లో స్పందిస్తున్నా, తన సొంత ప్రాంతానికి టెక్స్‌ టైల్‌ జోన్‌ రాకుండా తరలిపోతున్నా…. ఉమ్మడి జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాల విషయం లో స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తాము ఈరెండింటి విషయంలో ట్విట్టర్‌ లో ప్రశ్నించినవి కనిపించలేదా అనిప్రభాకర్‌ సూటిగా నిలదీశారు. కరెంట్‌ విషయంలో ముఖ్య మంత్రి దృష్టికి పోవాలంటే నీ మంత్రి కారు అద్దాలు పగుల గొట్టాలా… అడ్డుకుని నిలదీయాలా బంద్‌లు చేయాలా ఏవిదంగా ఆందోళనలుచేయాలో కూడాచెప్తే అదేవిదంగా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభాకర్‌ కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. పాత్రికేయుల సమావేశంలో నగర అద్యక్షుడు కర్ర రాజశేఖర్‌, కార్పోరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆకులప్రకాశ్‌, మదు, బుచ్చిరెడ్డి, బాసెట్టి కిషన్‌, బాస్కర్‌, పొన్నం సత్యం, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.