వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు
హుండీ ఆదాయం రూ.17.75 కోట్లు
స్వామివారిని దర్శించుకున్న 6.54 లక్షల మంది భక్తులు
తిరుమల,అక్టోబర్19(జనంసాక్షి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు అంగరంగవైభవంగా ముగిసాయి. ఈ నెల 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరిగాయి. తమిళులకు పవిత్రమైన పెరటాశినెల, దసరా సెలవులు రావడంతో విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, లడ్డూప్రసాదం, అన్నప్రసాదాలు, బస, భద్రత తదితర ఏర్పాట్లను టిటిడి చేపట్టింది. బ్ర¬్మత్స వాల్లో దాదాపు 6.54 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గరుడసేవనాడు శ్రీవారి మూలమూర్తిని 1.03 లక్షల మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.17.75 కోట్లుగా తేలింది.
వగపడి ఆదాయం రూ.6.70 కోట్లుగా గుర్తించారు. స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవలు, రథోత్సవం, చక్రస్నానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 750 సిసిటివిలు, బాడివోర్న్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బ్ర¬్మత్సవాల రోజుల్లో 3 వేల మంది, గరుడసేవ నాడు అదనంగా 1000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహించారు. 800 మంది శ్రీవారి సేవకులు, 700 మంది స్కౌట్స్, గైడ్స్, 200 మంది ఎన్‌సిసి క్యాడెట్లు, 400 మంది ¬ంగార్డులు, 300 మంది టిటిడి సెక్యూరిటీ గార్డులు, ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం, 25 మంది గజ ఈతగాళ్లు భక్తులకు సేవలందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని వీడియో వాల్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించారు. భక్తులకు వసతి కల్పించడం వలన 8 రోజులకు గాను టిటిడికి వచ్చిన ఆదాయం రూ.1.21 కోట్లుగా తేల్చారు. బ్ర¬్మత్సవాల 8 రోజుల్లో 22 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది. ప్రతిరోజూ 10 టన్నుల కూరగాయలను దాతలు విరాళంగా అందించారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో అదనంగా 41 మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. గరుడసేవనాడు 120 టన్నుల చెత్త తొలగింపు చేపట్టారు. భక్తులను ఆకర్షించే రీతిలో దాదాపు 116 దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను రూపొందించారు. 23 ఆర్చిలను ఏర్పాటుచేశారు. మాడ వీధులతో పాటు వివిధ ప్రాంతాల్లో భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు వీలుగా 33 ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు. శ్రీవారి బ్ర¬్మత్సవాల్లో మొత్తం హిందూధర్మప్రచార పరిషత్తు, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో 87 కళాబృందాల్లో 3,290 మంది కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌ఘడ్ రాష్టాల్ర కళాకారులు వాహనసేవల ముందు, తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. పౌరాణిక అంశాలతోపాటు రంగురంగుల పుష్పాలతో పుష్పప్రదర్శనశాల. వామనావతారం, పాలకడలిలో విష్ణుమూర్తి సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇకపోతే శ్రీవారి బ్ర¬్మత్సవ వైభవాన్ని భక్తుల కళ్లకు కట్టేలా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో రోజుకు 13 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు చేసింది.