వైసీపీ, జనసేన, బీజేపీ మధ్య.. రహస్య ఒప్పందం

– కాంగ్రెస్‌ అధికారంలోకిరాగానే ¬దాపైనే తొలిసంతకం
– సమస్యలపై పోరాటంచేయడంలో వైసీపీ విఫలమైంది
– కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తేవాలి
– ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి
విజయవాడ, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో ప్రతిపక్షంగా వైసీపీ విఫలమైందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలోని సింగ్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. వైసీపీ, జనసేన, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక ¬దా ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇంటింటికీ కాంగ్రెస్‌ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని రఘువీరా తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఇంటింటికీ కాంగ్రెస్‌ లో భాగంగా ప్రజల్ని కలుస్తున్నామని.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలుపై తొలి సంతకం చేస్తామని తెలిపారు. రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేసిన రఘువీరారెడ్డి… 44 వేల పోలింగ్‌ బూత్‌లలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ విఫలం అయ్యిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా వస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందని రఘువీరా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని, ఏపీలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.  పొత్తులపై రాహుల్‌ నిర్ణయం మేరకు ముందుకెళ్తామని రఘువీరా స్పష్టం చేశారు.

తాజావార్తలు