వొడా ఫోనుకు 100 కోట్ల జరిమానా విధించిన టెలికాం శాఖ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): వొడాఫోన్‌కు కేంద్ర టెలికాం శాఖ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2003 నుంచి 2005 మధ్య ఎస్టీడీ సర్వీసులను లోకల్‌ సర్వీసులుగా మార్చినందుకు ఈ జరిమానా వేసింది. ఇదే తరహా ఆరోపణల మీద మే నెల 30న భారతీ ఎయిర్‌టెల్‌పైన కూడా టెలికాం శఖ జరిమానా విధించిన విషయం తెలిసిందే.
అటు వొడాఫోన్‌, ఇటు భారతీ ఎయిర్‌టెల్‌… రెండూ కూడా వేర్వేరు కారణాల వల్ల తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్‌ దాదాపు 12 వేల కోట్ల రూపాయల ట్యాక్స్‌ చెల్లించాలని ఐటీ శాఖ గట్టిగా పట్టుపడుతుంది. దీని మీద కోర్టు బయట సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరాంచుకునేందుకు కేంద్ర కేబినేట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సమయంలో వంద కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎయిర్‌టెల్‌ కూడా దక్షిణాఫ్రికా మార్కెట్లో నష్టాల నుంచి బయటపడటానికి కిందా మీదా పడుతుంది.