వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో లిమ్కా బుక్‌లో చిత్తూరు

హర్షం వ్యక్తం చేసిన సిఎం చంద్రబాబు

విజయవాడ,జనవరి28(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకోవడం సంతోషమని, ఇన్నోవేషన్స్‌లో మనం నెంబర్‌ వన్‌ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వేసవిలో తాగునీటి సరఫరాపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. కొత్త రేషన్‌ కార్డులు, స్ల్పిట్‌ కార్డుల కోసం 55,540 దరఖాస్తులు వచ్చాయని, 7,024 దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. చ్చే నెల 2,3,4 తేదీల్లో 4 లక్షల ఇళ్లలో గృహప్రవేశం చేస్తామని, ఆర్టీజీ డేటాలో ఇంకా పర్‌ఫెక్షన్‌ రావాలన్నారు. ల్యాండ్‌ హబ్‌, సీఎంఎఫ్‌ఎస్‌ వ్యవస్థలు మెరుగుపడ్డాయని సీఎం చెప్పారు. ఆర్టీజీకి, ఆయాశాఖల క్షేత్రస్థాయి పరిశీలనకు అనుసంధానం ఉండట్లేదని, ఆర్టీజీ సమాచార ఆధునికీకరణలో వెనుకబడుతోందని ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల 2 లోపు పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లోని టాయిలెట్స్‌ దరఖాస్తులను పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు.