శని త్రయోదశి ముస్తాబైన శనీశ్వర స్వామి ఆలయం

మోమిన్ పేట ఫిబ్రవరి 17 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన మోమిన్ పేట మండలం లోఎన౽ తల గ్రామంలో వెలిసిన శంకర్ భారత్ మహారాజ్ చేతుల మీదుగా ప్రతిష్టించిన శనీశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది శని అమావాస్య శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామి కి నల్ల నువ్వుల నూనె నల్లని గుడ్డలతో తైలాభిషేకం చేస్తే మనిషి కి పట్టిన శని దూరమై కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఆలయ ప్రాంగణంలో సప్త వృక్షాలు సత్తా మందిరాలు శంకర్ భారత్ మహారాజ్ చేతుల మీదుగా ప్రతిష్టించారు నేడు శని త్రయోదశి సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల అలంకరించారు ఏర్పాట్లను దేవాదాయశాఖ కార్యనిర్వహణ అధికారి వై నరేందర్ శనీశ్వర ఆలయం కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం త్రాగు నీటి వసతి వైద్య శిబిరం వంటి సదుపాయాలు కల్పించారు దూరప్రాంతాల భక్తులకు రవాణా సౌకర్యాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి ఆర్టీసీ అధికారులను కోరారు