శాసనసభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు శాసనసభలో అందోళన కొనసాగిస్తున్నారు. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే… తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తెలంగాణపై తీర్మానం చేయాలని నినాదాలు చేశారు.