శివకాశిలో ఘోర ప్రమాదం
శివకాశి, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) :
తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. మరో 78 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శివకాశిలోని పారిశ్రామిక కేంద్రంలో ఉన్న ఓం శివశక్తి ఫైర్ వర్క్స్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభ వించింది. పేలుడు దాటికి పరిశ్రమలోని 40 గదులు ధ్వంసమ య్యాయి. మంటలు పక్క పరిశ్రమలకు వ్యాప్తి చెందాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. క్షతగాత్రుల్లో 30 మంది మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో 35 మంది శివకాశి ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇతర ఆస్ప త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విష మంగా ఉంది. ప్రమాద విషయం దావా నలంలా వ్యాపించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయ పడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 10 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాప్తి చెందకుండా ఫోమ్ చల్లుతున్నారు. శిథిలాల్లో మరి కొందరు చిక్కుకున్నట్లు గుర్తించారు. వారిని వెలికితీసేందుకు చర్యలు ప్రారంభించారు. సాయమం దించడానికి ముందకొచ్చిన పలువురికి కూడా తీవ్ర గాయాల య్యాయి. గాయపడిన వారిలో నలుగురు విలేకరులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు మృత దేహాలను వెలికితీసినట్లు పోలీ సులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవిం చడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర య్యారు. ప్రమా దానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని పోలీసు అధి కారి పి.కురు పయ్య తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల లోపలి మందు గుండు సామ గ్రి కాలిపోయి ఘాటు వాసనలు వ్యాపించాయి. దీంతో పరిసరాల్లోని ప్రజలు స్పృహ కోల్పోయారు. మంటలు, పొగ లు వంద మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. పరిశ్రమలో అనుభవం లేని కార్మికులు ఉండడంతో వారు తగిన మోతాదులో మందులు కలుప కపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రాష్ట్ర రాజ ధాని చెన్నైకి 650 కిలోవిూటర్ల దూరంలో ఉన్న శివకాశి బాణాసం చా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ బాణాసంచా తయారు చేసే పరిశ్రమలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ తయారైన బాణా సంచా ఆసియా దేశాలకు ఉత్పత్తి అవుతుంది. అంతటి ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో ఏటా ప్రమాదాలు జరగడం సాధారణంగా మారింది. ఏటా వందలమంది కార్మాకులు మరణిస్తూనే ఉన్నా కంపెనీల యాజమాన్యాలు గానీ, ప్రభుత్వం గానీ సరైన భద్రతా చర్య లు తీసుకున్న దాఖలాల్లేవు.