శివా నీవైన కేసీఆర్ మనస్సు మార్చు

శివా నీవైన కేసీఆర్ మనస్సు మార్చు

రాయికల్,సెప్టెంబర్ 30(జనంసాక్షి)
అంగన్వాడీలను ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
రిలే నిరాహారదీక్షలు
20వ రోజుకు చేరుకుంది
మార్కండేయ ఆలయానికి ర్యాలీగా వెళ్లిన అంగన్ వాడి టీచర్లు ఆయాలు,శివలింగాన్ని దర్శించుకొని పొర్లు దండాలు పెట్టారు. ఈశ్వారా కేసీఆర్ మనస్సు మార్చి మా ఉద్యోగాలు పర్మినెంట్ చేసేలా దీవించు తండ్రి అని వేడుకున్నారు.
ప్రభుత్వం ఎంత వేడుకున్నా స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ తెలంగాణ ఆడబిడ్డలం మమ్మల్ని భాద పెట్టకుండా మా సమస్యలను పరిష్కరించండి అంటూ అవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడీ ఉద్యోగులను సుప్రీంకోర్టు ఆదేశానుసారం బెనిఫిట్స్ కల్పించాలనీ, గ్రామంలో ఓటర్లసర్వే, బాత్రూం సర్వేల పేర్లతో మీటింగులు పెడుతూ ఇతర పనులకు అంగన్వాడీలను పరిమితం చేస్తూ విద్యార్థులకు చదువు చెప్పే సమయంలో చెప్పకుండా చూస్తున్నారని,
ఒకవేళ విద్యార్థుల హాజరు శాతం తగ్గితే విద్యార్థులు ఎందుకు రావడం లేదంటూ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆన్లైన్ మాధ్యమాలలో సమాచారాన్ని పొందుపరచుట కష్టంగా మారిందని వెబ్సైట్ లు పనితీరు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని
కనీసం ప్రభుత్వం టి ఎ.డిఎ లు కూడా ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ గుర్తించక
అన్యాయంగా అంగన్ వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి ఇతరులకు భాద్యతలు అప్పగించడంతో మనోవేదకు గురి అవుతున్నామని
ప్రభుత్వాలు మా సమస్యల పట్ల తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీలు లావణ్య, రమాదేవి,మిట్టపెల్లి పద్మ, రాధ,రమ,ఉమాదేవి,సుమలత,రాజేశ్వరి, సుజాత, గోదావరి, బుజ్జమ్మ అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.