Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Main > శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అభివృద్ధిలో అగ్రతాంబూలం – ప్రభుత్వ విప్ అరికెపూడిగాంధీ” / Posted on June 3, 2022
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అభివృద్ధిలో అగ్రతాంబూలం – ప్రభుత్వ విప్ అరికెపూడిగాంధీ”
శేరిలింగంపల్లి, జూన్ 03( జనంసాక్షి): లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సమగ్ర ప్రణాళికతో సంపూర్ణ మౌలిక వసతుల కల్పనద్వారా నియోజకవర్గ అభివృద్ధిలో అగ్ర తాంబూలాన్ని అందిస్తానని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు హఫీజ్ పేట్ డివిజన్ పరిధి ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీనగర్ నాల వరకు 2.4 కిలోమీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనులను మదీనాగూడ పరిధి రామకృష్ణ నగర్ వద్ద మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తోకలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్రమైన కార్యాచరణతో నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టబోయే అభివృద్ధి పనులద్వారా నియోజకవర్గానికి అగ్రతాంబూలం అందిస్తానని, ప్రజాదరణ, ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలలో టిఆర్ఎస్ పార్టీపట్ల ఉన్న నమ్మకాన్ని మరింత ఇనుమడింప జేయడానికై తాను అవిశ్రాంతంగా పనిచేస్తానని గాంధీ స్పష్టంచేశారు. ఈర్ల చెరువు వద్దనుండి దీప్తిశ్రీ నగర్ నాలావరకు15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సకాలంలో సదరు నాలాను పూర్తి చేయడంద్వారా వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల నుండి విముక్తి కలిగించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంపరిధిలో అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీఉండబోదని, ప్రతి పనిని శాశ్వత ప్రాతిపదికన దశలవారీ కార్యాచరణతో పూర్తిచేయడం జరుగుతుందని గాంధీ అన్నారు. నాలా విస్తరణపనులపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతున్నామని, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కారణంగా నాలా విస్తరణ పనులను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో కూడిన పద్ధతిలో పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఇది GHMC, జలమండలి , ఇరిగేషన్ విభాగాల సహకారం, సమన్వయంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని, ఎలాంటి అవకతవకలు, అలసత్వానికి తావు ఉండబోదని ఆయన ధీమాను వ్యక్తంచేశారు. మరికొద్ది నెలల్లో రాబోయే వర్షకాలాన్ని దృష్టిలోపెట్టుకొని నియోజకవర్గంలోని అన్నిప్రాంతాలలో ఉన్న నాలాల సమాచారం సేకరించి అవసరాలకనుగుణంగా విస్తరణ పనులను చేపట్టి వేగవంతం చేయడానికి అధికారులతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తామని అరికెపూడి స్పష్టంచేశారు. నాలాల విస్తరణపై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గాంధీ పేర్కొన్నారు. కరోనా వంటి విపతర్కపరిస్ధితుల్లోసైతం అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం రాజీలేకుండా అభివృద్ధిపనులను చేపట్టడం జరుగుతుందన్నారు. నాలా విస్తరణపనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, ప్రజావసరాల దృష్ట్యా నాలావిస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. పనులలో నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతాయుతంగా మసలుకోవాలని, గత అనుభవాలను దృష్టిలోపెట్టుకొని లోతట్టుప్రాంతలు, నీరు నిల్వవుండే ప్రాంతాలనుగుర్తించి ప్రజలకు ఇబ్బందికల్గకుండా చూడాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.