శ్రీవారిని దర్శించుకున్న ఎర్రబెల్లి
తిరుమల,అక్టోబర్13(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని టిఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎర్రబెల్లి అన్నారు.