శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం
పినపాక నియోజకవర్గం ఆగష్టు 27 (జనం సాక్షి): అశ్వాపురం మండలం లోని బండ్లసిరిగుట్ట శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రమైన శనివారం సందర్భంగా. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం పూజలు, భజనలు, అన్నప్రసాదం వైభవంగా ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దాత సింగపూర్ వాస్తవ్యులు కోలా యశస్విని,నరేంద్ర దంపతులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కొండపైకి మెట్లనిర్మాణంకోసం ఖమ్మం వాస్తవ్యులు రేపాక. రమేష్ కుమార్, లక్ష్మీగౌరి దంపతులు, అశ్వాపురం, గౌతమి నగర్ వాస్తవ్యులు బుర్రగోని. అనిల్ కుమార్, శ్రీలత దంపతులు మెట్లకు ఒక్కొక్కరు రూ. 2,700 చొప్పున ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు.శ్రీవేంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కోండ్రు. జిబ్బయ్య, కార్యవర్గ సభ్యులు దేవుడమ్మ, తెల్లం.నాగరాజు, చింతల.లింగయ్య, జక్కుల. వీరన్న, పి.నవీన్, పి.సాయి ప్రశాంత్,పసుపులేటి.శ్రీలత, తెల్లం.వెంకట లక్ష్మీ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.