సంగారెడ్డి మున్సిపాలిటీ లో మంచినీళ్ళ కొరత..

వ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న మహిళలు.
— పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి):

సంగారెడ్డి పురపాలక సంఘము 29 వార్డు  మార్క్స్ నగర్ పొచమ్మ ల వారి బస్థిలో గత కొన్ని రోజులుగా బోర్ మోటార్ చేడిపోయి నీటి సరఫరా లేక అవస్తలు పడుతున్న స్థానిక మహిళలు, ప్రజలు వెంటనే నీటి సరఫరా చేయాలని అధికరూలకు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నారు .ఈ సందర్భంగా ఇట్టి నీటి సమస్య వున్న కాలనీ బస్తి వాసుల సమస్య గురించి తెలుసుకున్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఇట్టి బస్తీని  సందర్షించి బస్తి వాసుల తో పాటు మాట్లాడుతూ మార్క్స్ నగర్ పొచమ్మ బస్తి వాసుల నీటి బోర్ మోటార్ మరమత్త్ చేసి నీటి సరఫరా చేయాలని అదే విదంగా ఇక్కడి బస్తి వాసులకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్య రాకుండా  పరిష్కారం చేయాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి పురపాలక సంఘము  అధికారులకు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమములొ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి సహా కార్యదర్శి శ్రీకాంత్, సిద్దర్దనగర్ సంక్షేమ సంఘము నాయకుడు నర్సింలు. మార్క్స్ నగర్ పొచమ్మ ల్లొల్ల బస్తి వాసులు  జమ్మమ్న, దస్తయ్య,పెద్ద పోచయ్య, అక్థర్ భి నర్సమ్మ,సుషీలమ్మ,రెనమ్మ,శాంతమ్మ చిన్న పొచయ్య,బెతయ్య తదితరులు పాల్గొన్నారు.