సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు
– రూపాయలు 40 కోట్లు మంజూరు
-రానున్న రోజుల్లో రెండు మున్సిపాలిటీలకు మహర్దశ టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , జూలై 22 ::సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు అయ్యాయని, రూపాయలు 40 కోట్లు మంజూరు అయ్యాయని, రానున్న రోజుల్లో రెండు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టణందని టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావులకు టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.శనివారం చింత ప్రభాకర్ ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీ రమణ తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూసంగారెడ్డి ,సదాశివపేట మున్సిపాలిటీలకు టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులు రూ.20 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు చింతా ప్రభాకర్ వివరించారు సంగారెడ్డి మున్సిపాలిటీకి గతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ. 50 కోట్లు టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులు 10 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.అలాగే సదాశివపేట మున్సిపాలిటీకి సీఎం కేసిఆర్ ప్రత్యేక నిధులు రూ.25 కోట్లు టి.యు.ఎఫ్.ఐ.డి.సి రూ.10 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు గతంలో సీఎం కేసిఆర్ ప్రత్యేక నిధులు 60కోట్లతో సంగారెడ్డి మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందిందని, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఆ నిధులతో పరిష్కారం పరిష్కారం చేసినట్లు వివరించారు.సంగారెడ్డి మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రిలు హరీష్ రావు ,కేటీఆర్ లకు కృతజ్ఞతలు.పెండింగ్ లో ఉన్న పనులు , ప్రజలు ఇబ్బంది పడుతున్న అత్యవసరమైన పనులను ఈ నిధుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.సంగారెడ్డి ,సదాశివపేట మున్సిపాలిటీ లపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు ,కేటీఆర్ కు చింత ప్రభాకర్ శనివారం ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.