సంచలనాల కోసం వార్తలు వొద్దు

మీడియా నిస్పాక్షిక వార్తలే ఇవ్వాలి
కేయూడబ్ల్యూజే గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని
కొచ్చి, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :
సంచలనం సృష్టించాలన్న భావనను విడనాడా లని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విూడియాకు సూచించారు. సమాజాన్ని, దేశాన్ని విడదీసేలా వార్తలు ప్రచురించకూడదని, ప్రసారం చేయ కూడదని హితవు పలికారు. వివిధ వర్గాల మధ్య, వేర్వేరు మతాల మధ్య మత సామర స్యాన్ని పెంపొందించడంలో విూడియాది కీలక పాత్ర అని అన్నారు. ఈ నేపథ్యంలో విూడియా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, నిష్ప క్షికమైన సమాచారాన్ని మాత్రమే చేరవేయాలని సూచించారు. కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలను ప్రధాని గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విూడియా స్వయం నియంత్రణ పాటించాలన్నారు. ‘సంచలనం సృష్టించాలన్న భావన కొన్నిసార్లు విపరిణామాలకు దారి తీయొచ్చు. సమాజం, దేశం మధ్య చీలిక తెచ్చే ప్రచురణలను, ప్రసారాలను నియంత్రించాలని’ హితవు పలికారు. ఇటీవల చెలరేగిన అసోం హింసాత్మక ఘటనలపై సంచలనం కోసం వార్తలు ప్రసారం చేయడం వల్ల.. దాని ప్రభావం దేశవ్యాప్తంగా పడిందని, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఈశాన్య ప్రాంత వాసులు సొంత రాష్టాల్రకు తరలిపోయారని గుర్తు చేశారు. అలాంటి వార్తలకు దూరంగా ఉండాలని విూడియా కు సూచించారు. ‘మన దేశం ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. దురదృష్టవశాత్తు కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనలు మన సమాజంలోని తప్పులను ఎత్తిచూపాయని’ అన్నారు. అసోంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరా బాద్‌ సహా ఇతర ప్రాంతాలపై పడడం దురదృ ష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల మధ్య, మతాల మధ్య పరస్పర విశ్వాసం కల్పించాల్సిన అవసరంఉందని అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను
సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కేవలం ప్రజాభిప్రాయాన్ని వెల్లడించడమే కాకుండా.. జాతి రక్షణ బాధ్యత కూడా విూడియాపైనా ఉందన్నారు. వివిధ మతాలు, వర్గాలు, భాషలతో సమ్మిళితమైన భారత్‌లో.. స్వేచ్ఛాయుతమైన విూడియా తన బాధ్యతలు గుర్తెరిగి వ్యవహరించాలని హితవు పలికారు.