సంతాన సాఫల్య వైద్య శిబిరం విజయవంతం
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 26(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం హైదరాబాద్ కు చెందిన ఫేర్ టి 9ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ తులసి, అనుష రెడ్డి లు 41మందికి వైద్య పరీక్షలు చేసి తగిన సూచనలు ఇచ్చారు. డాక్టర్ తులసి మాట్లాడుతూ ఫేర్ టి 9లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందన్నారు. ప్రతినెల సంరక్ష హాస్పిటల్ లో ఈ వైద్య సేవలు ఉంటాయన్నారు. సంతానం లేని వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది అశ్విని, హరినాథ్ తదితరులు సేవలు అందించారు