సంప్రదాయానికి ప్రతీక రక్షాబంధన్
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): రక్షాబంధన్ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తుంది. సోదరులకు సోదరీమణులు ఆప్యాయతతో కట్టే రాఖీ మన సంప్రదాయాలకు అద్దం పడుతోంది.
ప్రేమానురాగాలకు ఇది తార్కాణం. సోదరులకు రక్ష కట్టి తమకు రక్షగా ఉండాలిన సోదరీమణులు కోరకుంటారు. రక్షరట్టి స్వీటు తినిపించడం మనకు ఆచారంగా వస్తోంది. సోదర, సోదరీమణుల అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండగ అద్దం పడుతుంది.ఇక ఇదేరోజు జంధ్యాల పున్నమిగా కూడా భావిస్తున్నారు. ఉపనయనం చేసుకున్న వారు కొత్తగా యజ్ఞోపవీతాన్నా మార్చుకోవడం ఆచారంగా వస్తోంది. నూలుతో వడికిన జంద్యాలను ఈ రోజు ధరించడం ప్రత్యేకత. ఈ పౌర్ణమినే రక్షా పౌర్ణమి, జంద్యాల పున్నమి, రాఖీ పూర్ణిమ, నూలు పున్నమి, నారికేళ పున్నమిగా వ్యవహరిస్తారు. శ్రావణమాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో శ్రావణమాసం అంటారు. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆకాశం మబ్బులతో వెండికొండలను తలపిస్తుంటుంది. పూర్వకాలం వేద అధ్యయనం శ్రావణమాసంలోనే ప్రారంభమయ్యేది. విష్యత్‌పురాణంలో రక్షాబంధన్ గురించి వివరించారు. బలి చక్రవర్తిని విష్ణుమూర్తి దేవతల కోరిక మేరకు బంధిస్తాడు. అయితే ఈ బంధం అతనికి రక్షణగా నిలుస్తుందని వరమిచ్చినట్టు తెలుస్తోంది. పాల్కురికి సోమనాధుడు ఈ పౌర్ణమిని నూలి పున్నమిగా అభివర్ణించాడు. కర్ణాటకలో నారికేళ పున్నమిగా పండగ నిర్వహిస్తారు.