సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
విశాఖపట్టణం,అక్టోబర్24(జనంసాక్షి): వ్యక్తిగ మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, సకాలంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన అధికారులకు అవార్డులిస్తామని డిఆర్డిఎ అధికారి అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి లక్ష్యం పూరతయ్యేలా చేయాలని అన్నారు. అధికారులు సరిగా పనిచేయకపోతే జీతం కట్ చేస్తామని హెచ్చరించారు.మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఉపాధి కూలీలకు పనులు లభిస్తున్నాయనన్నది ఆరా తీసారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చుదిద్దాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేనివారికి గ్యాస్, రేషన్, పింఛను, తాగునీరు వంటి సౌకర్యాలు కట్ చేస్తామని హెచ్చరించారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. గ్రామాల వారీగా లెక్కలు తీసి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సివుందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ మలవిసర్జన గ్రామాలను తీర్చిదిద్దేందుకు పోటీ పడాలన్నారు. అనుకున్న విధంగా మరుగుదొడ్లను పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. శతశాతం ఫలితాలను సాధించేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధు లు సంయుక్తంగా కృషి చేయాలని కోరారు. టీమ్‌లుగా ఏర్పడి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.