సగం రాష్ట్రం వరదనీటితోనే
గౌహతి అస్సాం రాష్ట్రాన్ని వరదలు వదలడంలేదు బ్రహ్మపుత్రానది పోంగిపోరలుతుండడంతో ప్రస్తుతం సగం రాష్ట్రం నీట మునిగి ఉంది .27 జిల్లాల్లో 16 నీటమునిగాయి. ఇళ్లు కోట్టుకుపోవడంతో 17లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గోగోయ్ జపాన్ పర్యటనలో ఉన్నారు. వరద తీవ్రత తెలుసుకున్న అయన పర్యటన ముగించుకోని ఈరోజు ఢిల్లీ తిరిగివస్తారని సమాచారం. వరద బాధిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల సహయంతో సహయకచర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యలయం అధికారులకు అదేశాలు .జారీచేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 166 పునరావాస శిభిరాల్లో రెండు లక్షల మంది అశ్రయం పోందుతున్నారు.