సత్తా చాటిన సింధు
పీవీ సింధు చైనా ఓపెన్‌లో తొలి రౌండ్లో తన సత్తా చాటి రెండో రౌండ్లోకి దూసుకుపోగా సైనా తొలి రౌండ్లోనే నిరాశపరిచింది.మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా మూడు నెలల తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీతో మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన తొలిరౌండ్లో సైనా థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోర్న్‌టిప్ బురనప్రసేత్యుతో తలపడింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న సైనా వీరోచితంగా పోరాడి రెండో సెట్‌ను గెలుచుకుంది. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. హోరాహోరీగా జరిగిన మూడో సెట్‌లో సైనా తడబడింది. దీంతో సైనా 16-21, 21-19, 14-21తో మూల్యం చెల్లించుకుంది. దీంతో తనకు ఎంతో కలిసొచ్చిన చైనా ఓపెన్‌తో పునరాగమనం చేసిన సైనాకు తీవ్ర నిరాశే ఎదురైంది. మరో పక్క ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలిరౌండ్లో సింధు చైనీస్ తైపీ క్రీడాకారిణి సిన్ లీతో తలపడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు 21-12, 21-16తో కేవలం 34 నిమిషాల్లోనే విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.