సమాజానికి దిక్సూచి పత్రికలే.
సమాజానికి దిక్సూచి పత్రికలు మాత్రమే అని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజేశం,చిట్యాల మండల కన్వీనర్ మాసు రమేష్ లు అన్నారు. గురువారం మండల కేంద్రము లో వారు మాట్లాడుతూ పత్రికలు సమాజానికి వెలుగు దివ్వెలు,సమాజ వికాసానికి పత్రికలు పోషిస్తున్న పాత్ర ఎనలేనిది.ప్రతి పాఠకుడు పత్రికలను నిరంతరం అధ్యయనం చేయాలని, సంపాదకీయ పేజీ పత్రికలకు గుండెకాయ లాంటిదని రచయితలు పత్రికలపై మక్కువ పెంచుకొని సంపాదకీయ పేజీకి ఉత్తరాలు, వ్యాసాలు రాసి పాఠకుల ఆదరాభిమానాలు పొందాలన్నారు. ప్రతి పత్రిక పాఠకులకు పెద్ద పీట వేస్తూ వుందని, పత్రికలకు వ్యాసాలు రాయాలని, ప్రతి ఒక్కరిపై ఈ భాధ్యత ఉంది. ప్రజా సమస్యలను వెలికి తీస్తున్న రచయితల స్పూర్తి గొప్పదనీ ,పత్రికలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సతీష్ రెడ్డి, రాజేశం,రమేష్ లు సంయుక్తంగా పేర్కొన్నారు.