సమాజ పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలి:సుఫ్రీంకోర్టు

న్యూడిల్లీ : వార్తను ప్రసారం చేయడం లేదా ముద్రించే ముందు పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రింకోర్టు సూచించింది కోర్టు విచారణలో ఉన్న వార్తల ప్రచరణ అంశంపై ఈరోజు సుప్రిం తీర్పును వెలువరించింది కోర్టు కార్యకలాపాల ప్రచురుణపై సముచిత నియంత్రణ అన్నది సామాజిక బాధ్యతాని స్పష్టం చేసింది మీడియాకు సంబంధించి దాఖలయ్యే కేసులను విడివిడిగానే పరిగణరలోకి తీసుకొని ఆదేశాలివ్వాలని పేర్కొంది జర్నలిస్టులు కోర్టు ధిక్కరణకు పాల్పడకుండా లక్ష్మణరేఖను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించింది వాక్‌ స్వాతంత్రం అంటే సంపూర్ణ స్వేచ్ఛ కాదని వెల్లడించింది కోర్టువిచారణలో అంశాలపై వార్తలకు సంబంధించి మీడియాకు ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను కోర్టు జారీ చేయలేదు మీడియా రిపోర్టింగ్‌ పై గంపగుత్తుగా మార్గదర్శరాలు రూపొందించలేమని తెలిపింది వార్తపై అభ్యంతరాలు ఉంటే తాత్కాలిక నిలుపుదల చేయడానికి న్యాయస్థానాన్ని సంప్రదించవ్చని చెప్పింది