సరస్వతీదేవి అలంకరణలో గాయత్రీదేవి
కర్నూలు,,అక్టోబర్15(జనంసాక్షి): దేవి నవరాత్రుల్లో భాగంగా భక్తులకు ఆస్పరి మండలంలోని శంకరబండ సవిూపంలో ఉన్న రామతీర్థం కొండపై కొలువైన గాయత్రీదేవి అమ్మవారు దేవీ నవరాత్రులలో భాగంగా సరస్వతీ అలంకరణలో సోమవారం దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆస్పరి పట్టణంలోని వాసవీమాత ఆలయంలో కన్యాకా పరమేశ్వరీ దేవి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవార్లకు విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. గాయత్రీదేవి ఆలయంలో గాయత్రీదేవి ¬మాన్ని వేదపండితులు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.