సరిహద్దుల భద్రత పటిష్ఠానికి..  కేంద్రం చర్యలు


– భారత్‌ -చైనా సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారులు
– శాశ్వత భవనాలు చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్‌19(జ‌నంసాక్షి) : చైనా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేందప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్టాల్లోన్రి భారత్‌-చైనా సరిహద్దు
ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారులు, శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సాధికారక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లో రూ. 25వేల కోట్లతో చేపట్టే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భాగంగా వీటిని నిర్మించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్టాల్లో 19 రహదారులు, 29 శాశ్వత భవనాలు నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పక్రియ మొదలుపెట్టారట. నిర్మాణాల కోసం భూసేకరణ కూడా చేపట్టారని సదరు వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
దీంతో పాటు బంగాల్‌, అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్టాల్లోన్రి భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, కంచె నిర్మాణాలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇక గుజరాత్‌లోని తీర ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు 18 కోస్టల్‌ బోర్డర్‌ అవుట్‌పోస్టులను ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.