సర్వీస్ ఓటర్ల జాబితా ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలను మండలాల వారిగా తెలపాలి.

-గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వీస్ ఓటర్ల జాబితా మరియు ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలు అన్ని మండలాల వారిగా రిపోర్ట్ పంపాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తాసిల్దార్లకు ఆదేశించారు.శనివారం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాసిల్దారుల సమావేశం నిర్వహించి జిల్లాలోని సర్వీస్ ఓటర్ల జాబితా, ఇ ఆర్ ఓ నెట్ లో ఫార్మ్ 6 నందు రిజెక్ట్ అయి న కేసులను చెక్ చేసుకోవాలని, ఫారం 6, 7, 8 రిజెక్ట్ అయిన వాటి వివరాలు ఎందుకు రిజెక్ట్ అయిందో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. రిజెక్ట్ అయిన ఫారాలలో అర్హత ఉండి ఎందుకు రిజెక్ట్ అయిందో వాటి వివరాలు పొందు పరచాలన్నారు. ఫారం 6, 7, 8 మరోసారి తనిఖీ చేసుకొని బిఎల్వోలు పూర్తి సమాచారం నమోదు చేయాలన్నారు. అన్ని ఫారం లకు సంబంధించిన వివరాలు , రిజెక్ట్ అయినవారి పూర్తి వివరాలు ఆధారాలతో పాటు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎన్ని ఫార్మ్ 6 రిజెక్ట్ అయినవి, ఓటర్ జాబితా ను క్రాస్ చెకింగ్ నిర్వహించి ఈఆర్వో లాగిన్ లో పొందుపరచాలన్నారు. ధరణి మాద్యుల్స్ పై మాట్లాడుతూ ఒక గ్రామము నుండి వచ్చిన పెండింగ్ దరకాస్తులను సిబ్బంది స్థానికంగా ఉండి పంచనామా చేసి రిపోర్టు సబ్మిట్ చేయాలన్నారు. ప్రభుత్వ భూమి యా, అసైన్డ్ భూమి నా, దరకాస్తు ఇచ్చిన వారు పొజిషన్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసి ఫోటో తీసి పంపించాలని అన్నారు. భూములకు సంబంధించిన సర్వే రిపోర్ట్ తీసుకొని పూర్తి సమాచారం రెవెన్యూ రికార్డ్ లలో ఉండాలన్నారు. దరణి కి సంబంధించి పెండింగ్ ఉన్న వాటిని త్వరలో పూర్తి చేయాలన్నారు.ఆర్ ఐ లు పరిశీలించి పంచనామా నిర్వహించి వాళ్లు ఖస్తు లో ఉన్న ఫోటో తీసి రిపోర్ట్పంపాలన్నారు. నిజమైన లబ్ధిదారుల కాదా గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి అసలైన పట్టాదారు రూపొందించాలన్నారు. జిఎల్ఎం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ చీర్ల శ్రీనివాస్, ఆర్డీవో చంద్రకళ, అన్ని మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.