సామాజిక న్యాయం జరగాలంటే..  తెదేపా, వైసీపీలకు బుద్దిచెప్పాలి


– వీరికి ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తారు
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతి, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో సామాజికన్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇద్దరూ దిగిపోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బీసీలు చంద్రబాబు, జగన్‌కు ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తున్నారని మండిపడ్డారు. గర్జన, జయ¬ బీసీ సభలు నిర్వహించి బీసీలకు వరాలు కురిపిస్తున్నారని.. మరి రాజ్యసభలో ఇరుపార్టీలు ఒక్క బీసీ నేతకైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్‌ ఒక కులానికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని విమర్శించిన రామకృష్ణ… రాష్ట్రంలోని 13 జిల్లాల వైసీపీ సమన్వయ కర్తలు అందరూ తన సామాజిక వర్గానికే ఇచ్చారని అన్నారు. మరి బీసీలు పనికిరారా అని మండిపడ్డారు. చంద్రబాబు జగన్‌కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. వైసీపీలో ధర్మాన, పార్థసారథి, బొత్స పనికి రారా సమన్వయ కర్తలుగా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు, జగన్‌ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారు, కనీసం పార్టీ మారేవాళ్లకైనా బుద్ధి ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, జగన్‌ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారని…కనీసం పార్టీ మారే వాళ్ళకైనా బుద్ధి ఉండాలని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లు కార్పొరేట్‌లకు ఊడిగం చేసి ఎన్నికల సమయంలో రైతులపై ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు.