సామాన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయాల విషయంలో రాజీపడేదిలేదు:దీదీ
కోల్‌కతా: యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవద్దంటూ కాంగ్రెస్ అదిష్టానం తమతో సంప్రదింపులు జరిపలేదన్నారు. సామన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయంలోనైనా రాజీ పడేదిలేదన్నారు మమతా బెనార్జీ. నన్ను నమ్మిన సామన్య ప్రజలను మోసగిస్తే తనకు బతుకులేదన్నారు. సిలిండర్లు ఎడాదికి 24ఇవ్వాలన్నారు. ఏడాదికి ఓ ఇంటికి ఎన్ని సిలిండర్లు కావాలో మంత్రులకు తెలియకపోతే వారివారి ఇళ్లలో అడగాలన్నారు. యూపీఏలో సమన్వయం అనే పదానికి అర్థమే లేదన్నారు. విదేశీ పెట్టుబడులపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.