సాయంత్రం ప్రధానితో భేటీ కానున్న సోనియా
న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటీ కానున్నారు. భేటీలో కేంద్ర కేబినేట్ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర కేబినేట్‌లో ఎనిమిది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ యూపీఏ నుంచి వైదొలగడంతో రైల్వే శాఖ ఖాళీ అయింది, రైల్వే శాఖ కోసం డీఎంకే, ఎన్సీపీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ శాఖ కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కేబినేట్ పునర్‌వ్యవస్థీకరణపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.