సాయి గీతం చిట్ ఫండ్స్ ఆధ్వర్యంలో వినాయక పూజలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 02(జనం సాక్షి)
వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలోని ఓ సిటీలో గల సాయి గీతం చిట్ ఫండ్స్ ఆధ్వర్యంలో వినాయకుని పూజలు ఘనంగా నిర్వహించారు. ఆది దేవుడైన ఆ వినాయకునికి భక్తిశ్రద్ధలతో భజనలు చేసి ప్రార్థించారు. వినాయకుడు అందరిని చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి గజ్జి అశోక్ కుమార్, జితేందర్, కవిత, వర్ష, నాగరాజు తో పాటు కార్యాలయ సిబ్బంది, స్థానిక గృహవాసులు తదితరులు పాల్గొన్నారు.