సింగరేణిలో మూడవ తేదీన కొత్త వేతనాలు చెల్లింపు

సింగరేణిలో మూడవ తేదీన కొత్త వేతనాలు చెల్లింపు

11వ వేజ్ బోర్డు లో కుదిరిన ఒప్పందం ప్రకారం చెల్లిస్తున్న కొత్త జీతాలు అధికారుల కంటే ఎక్కువగా ఉన్నాయన్న కారణాన్ని సాకుగా చూపి కోలిండియాకు చెందిన ఒక ఉద్యోగి కోర్టుకు వెళ్లిన కారణంగా కోల్ ఇండియా లో ఈ నెల చెల్లించాల్సిన వేతనాలను కోర్టు తీర్పు వెలువడే వరకు నిలుపుదల చేయాలని సర్కులర్ విడుదల చేసిన నేపథ్యంలో…. సింగరేణి కార్మికులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు బోయిన్పల్లి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య లు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాదులో కార్మికులకు మరియు మీడియాకు వీడియో విడుదల చేసిన సందర్భంలో కోల్ ఇండియాలో కొత్త వేతనాల నిలుపుదల సర్కులర్ నేపథ్యంలో సింగరేణిలోనూ రెండవ తేదీ రోజున సాప్ లో వేతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కానీ విషయాన్ని గ్రహించి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ని మరియు డైరెక్టర్ పా బలరాం తో మాట్లాడి మూడో తేదీ రోజున యధావిధిగా కొత్త వేతనాలు చెల్లించేలా ఒప్పించడం జరిగిందని వివరిస్తూ …. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ జాతీయ సంఘాలమని చెప్పుకుంటున్న నాయకులు సరైన రీతిలో ఒప్పందాలు చేసుకోలేకపోవడంతోనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పుడు కూడా సమ్మె నోటీసు అని మాయ మాటలు చెబుతూ కార్మికులను మభ్యపెడుతున్న విషయాన్ని సింగరేణి కార్మిక లోకమంతా గ్రహించాలన్నారు. అనునిత్యం సింగరేణి ఉద్యోగుల వెన్నంటి ఉండే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘమే కార్మికులకు శ్రీరామరక్ష మరియు పూర్తి అండా దండా అని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కెసిఆర్,టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు ఈ విషయం లో మాట్లాడారని పేర్కొన్నారు