సికిల్ సెల్ వ్యాధి(ఎస్.సీ.డీ) పై అవగాహన పెంచాలి
ఖైరతాబాద్ : జూన్ 23 (జనం సాక్షి) వారసత్వంగా వచ్చే రక్త రుగ్మత సికిల్ సెల్ వ్యాధి(ఎస్.సీ.డీ) పై అవగాహన పెంచాలని నేషనల్ అలయన్స్ ఆఫ్ సికిల్ సెల్ సొసైటీ(ఎన్.ఎ.ఎస్.సీ.ఓ) కార్యదర్శి, సీఈఓ డాక్టర్ సుమన్ జైన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సికిల్ సెల్ డిసీజ్ భారం గురించి ఖచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ వరంగల్ జిల్లాలోని లంబాడా తెగలో అధిక ప్రాబల్యం ఉన్నట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయన్నారు. సత్వర రోగ నిర్ధారణ, చికిత్స అందించడానికి అత్యంత ముఖ్యమైన అంశం రోగి అవగాహన ద్వారా వారు సకాలంలో సహాయం పొందవచ్చన్నారు. సెక్రటరీ గౌతమ్ డోంగ్రే ఇలా మాట్లాడుతూ సకాలంలో సరైన చికిత్స అత్యంత ముఖ్యమైనదని అన్నారు.