సిక్కింలో కొండ చరియలు విరిగి పడి 24 మంది మృతి
గ్యాంగ్‌టాక్: ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్ కొండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) 9 మంది, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన 12 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ 9 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాంగాన్, చుంగ్‌తాంగ్ మధ్య సుమారు 30 కి.మీ రహదారి వరద ఉద్థృతికి కొట్టుకోపోయింది. చుంగ్‌తాంగ్ పట్టణంలోని ఐటీబీపీ నివాసగృహాలు పూర్తిగా నీట మునిగాయి.