సిక్కులకు కేంద్రం తీపి కబురు

 

కర్తార్‌పూర్‌ కోసం భారత్‌ పాక్‌ మధ్య కారిడార్‌

కేంద్ర కేబినేట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ,నవంబర్‌22(జ‌నంసాక్షి): సిక్కు మత గురువు గురునానక్‌ తన జీవితంలో చివరి 18ఏళ్ళు గడిపారని భావిస్తున్న పాకిస్తాన్‌లోని చారిత్రక గురుద్వారాను సందర్శించే యాత్రికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు ఉద్దేశించిన, భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య మతపరమైన కారిడార్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ ప్రాంతంలో తగిన సౌకర్యాలతో కారిడార్‌ నిర్మించేందుకు పాకిస్తాన్‌ను కూడా భారత ప్రభుత్వం సంప్రదించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లా¬ర్‌ నుండి 120కిలోవిూటర్ల దూరంలో ఈ చారిత్రక సిక్కు యాత్రా స్థలం కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా వుంది. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 3వేల మందికి పైగా సిక్కు యాత్రికులు బుధవారం నాటికి

లా¬ర్‌ చేరుకున్నారు. గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరా బాబా నానక్‌ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు కారిడార్‌ను నిర్మించి, అభివృద్ధిపరచాలని భారత ప్రభుత్వం భావించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విలేకర్లతో మాట్లాడుతూ, మూడు నుండి నాలుగు కిలోవిూటర్ల మేరా కారిడార్‌ వుంటుందని చెప్పారు. వీసా ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు తెలిపారు.