సిగ్నల్‌ లేకుండా 17 కి.మీ… దూసుకుపోవచ్చు!

ముంబయివాసులకు ‘ఫ్రీ వే’

ముంబయి: ముంబయి వాసులకు శుభవార్తే ఇది. కొత్తగా నిర్మించిన ఈస్టర్న్‌ ఫ్రీవే రేపటి నుంచి ఉపయోగంలోకి రానుంది. 17 కి.మీ పొడవైన ఈ రహదారిలో సిగ్నలుండవు. నిరాటంకంగా సాగిపోవచ్చు. సౌత్‌ ముంబయి నుంచి నగర తూర్పు ప్రాంత శివార్లకు ప్రయాణసమయం బాగా కలిగివస్తుంది. అప్పుడు గంట పట్టిన ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగే ఈ మార్గం రేపటి నుంచి ప్రజలు ఉపయోగించవచ్చు. 14 కి.మీ తొలి దశ పూర్తయింది. 2008లో ప్రారంభించిన ఫ్రీవే నిర్మాణానికి ప్రభుత్వం 1250 కోట్లు ఖర్చు పెట్టింది.