సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి లో ఆలన గా… ఆదరించే ఆరోగ్య సేవలు
సర్కారు ఆసుపత్రి ఆత్మవిశ్వాసం నింపే ఆసరా ఆరోగ్య సేవలు..
– మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తో వయో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులకు ఆరోగ్య భరోసా..
– వయో వృద్ధుల కు ఆత్మీయ భరోసాగా ఆసరా వాహనం…
– దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులకి ఆలంబనగా ఆలన వాహనం..
సిద్దిపేట బ్యూరో నవంబర్ 04( జనం సాక్షి )సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక నమ్మకం..విశ్వాసం పెంచే దిశగా మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. వైద్య సిబ్బంది.. వైద్యులు.. వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటం తో పాటు.. అన్ని రకాల వ్యాధులు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలని సిఎం కెసిఆర్ మార్గనిర్దేశిం తో మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత తెస్తున్నారు.. ఆదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ,వయో వృద్ధులకు ఒక వైపు ఆలనా గా ఆసుపత్రిలోనే సేవలు అందించే గొప్ప కార్యక్రమం మన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రారంభం కానుంది.. శనివారం రోజున మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు..
– చివరి శ్వాస లో కూడా ఆత్మవిశ్వాసం…
వృద్ధాప్యం లో ఉన్న , దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్న వ్యాధి గ్రస్థులకు చివరి శ్వాస లో కూడా ఆత్మీయ భరిసా.. ఆత్మవిశ్వాసం నింపే కేంద్రం ఆలనా మంత్రి హరీష్ రావు చొరవ తో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు అయింది.
ఆలనా సేవలు…
సిద్దిపేట జీజీహెచ్లోని నాల్గవ ఫ్లోర్ లో పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని ఏడు బెడ్ల కెపాసిటీతో ఏర్పాటు చేస్తున్నారు.
• ఈ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి సేవలు అందించనున్నారు. కేన్సర్, పక్షవాతం, రోడ్డు ప్రమాదాలతో మంచానికే పరి మితమైన వారి బాధ మాటల్లో చెప్పలేం.
• వీరు శారీరకంగా ఎన్నో చిత్రహింసలకు గురవు తుంటారు. ఇలాంటి వారికి కేంద్రంలో సేవలు అందించనున్నారు.
ఏడు బెడ్లతో ఏర్పాటు..
• కేన్సర్ ఉన్న వారికి కంతులు పెరుగుతుండడం నిరంతరం మంచంపై పడుకోవడం వల్ల చర్మం కమిలిపోవడం, ఇతర ఇన్ఫెక్షన్స్ తో కొత్త గాయాలు కావడం సర్వసాధారణం.
• అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న వారు మంచం పైనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
• వీరికి మానసిక స్థైర్యం పెంపొందించేలా కేస్సర్, ఇతర దీర్ఘకాలిక బాధిత కుటుంబాలకు కా న్సిలింగ్ చేస్తారు. వ్యాధి తీవ్రత మేర ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిందిగా సూచనలు చేస్తారు.
• నొప్పి నుంచి ఉపశమనం ఎలా పొందాలి… ఆయా గాయాలకు డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో ఈ కేంద్రం ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
• కేంద్రం లోనే కుటుంబ సభ్యుల్లో ఒకరిక శిక్షణ ఇస్తారు..
ఇది పేదలకు ఎంతో ప్రయోజనం..
• అత్యవసరమైతే కేర్ సెంటర్లోనే జాయిన్ చేసుకొని రెండు నుంచి మూడు వారాల పాటు పౌష్టికాహారంతో పాటు మందులు ఉచితంగా అందించనున్నారు.
• దీంతో పేద వర్గాలకు ఈ సదుపాయం ఎంతో ప్రయోజనం కలిగించనుంది. గజ్వేల్లో ప్రారంభంకాక ముందు ఆయా ప్రాంతాల వారు హైదరాబాద్లోని ఎంఎన్ జే ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రితో పాటు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లే వారు.
• సిద్దిపేటలో పాలియేటివ్ కేర్ కేంద్రం అందుబాటులోకి రానుండడంతో దీర్ఘకాలిక రోగులకు ఎంతో దోహదపడనుంది.
• కేంద్రంలోని ఒక పాలిటివ్ కేర్ ఫిజిషియన్తో పాటు ఒక ఫిజియో థెరపిస్ట్, ఐదుగురు స్టాఫ్ నర్సులు ఉండనున్నారు. వీరు కేంద్రంతో పాటు ఇంటింటికీ వెళ్లి శిక్షణ ఇవ్వనున్నారు.
– ఆరోగ్యానికి ఆసరా గా…
వయోవృద్దుల సేవలు
తెలంగాణా రాష్ట్రం లో తొలిసారిగా వయో వృద్దుల కోసం ప్రత్యేకంగా ఫిజియో థెరపీ మరియు ఇంటివద్దకు వెళ్లి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసింది..
ఒక వైపు ఆలనా వాహనం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి 3 రోజుల కు ఒక సారి ఇంటికి వెళ్లి అవసరం అగు చికిత్స చేస్తూ.. మరో వైపు ఆసరా వాహనము ద్వారా ఇంటి వద్దకు వెళ్లి తీసుక రావడం.. ఆసుపత్రి నుండి ఇంటికి క్షేమంగా చేర్చే గొప్ప కార్యక్రమం చేపట్టారు.. మంత్రి హరీష్ రావు గారి చొరవతో సిద్దిపేట ఆసుపత్రిలో త్వరలో ప్రారంభం కానుంది..
ఆసరా సేవలు..
౼౼౼౼౼౼౼౼౼
65 సంవత్సరాలు పైబడిన వయోవృద్దులకు సకల సౌకర్యాలు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లబిస్తున్నాయి.
ఇంటివద్ద సేవలు మరియు పిజియోథెరపీ ప్రస్తుతం లేవు ఇలాంటి సేవలు కావాలని మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి తో ప్రభుత్వాసుపత్రిల్లో సర్జరీలు మరియు ఇతర వైద్య సేవలు చికిత్స చేసిన డాక్టర్ సూచన మేరకు పిజియోథెరపీ మరియు ఇంటి వద్దే సేవలు అందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా, సిద్దిపేట జిజిహెచ్ 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్దుల కోసం ప్రత్యేక పిజియోథెరపీ మరియు ఇంటివద్దే సేవలు అందించే కార్యక్రమం “ ఆసరా “ ని ప్రారంబించడం జర్గుతుంది.ఈ కేంద్రం ద్వారా జిజిహెచ్ సిద్దిపేట లో చికిత్స పొంది, డాక్టర్ సూచన మేరకు ఇద్దరు స్టాఫ్ నర్సులు మరియు ఒక పిజియోథెరపిస్ట్ సేవలు అందిస్తారు. ఈ సేవలు అవసరమైన వారు రూమ్ నెంబర్ 14 లో నమోదు చేసుకోవలెను. వారంలో 3 రోజులపాటు ఆసుపత్రిలో మరియు మిగతా మూడు రోజులు గృహ సందర్శన సేవలు అందిస్తారు. ఇందుకోరకై ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ సూచన మేరకు ఇంటి వద్దే రక్త నమూనాలను సేకరించి సిద్దిపేట టి హబ్ లో పరీక్షలు చేసి నివేదికలు అందజేస్తారు.తదనుగుణంగా చికిత్చ అందిస్తారు.
– మానసిక ప్రశాంతత నే సంపూర్ణ ఆరోగ్యం..
మంత్రి హరీష్ రావు..
వృద్ధులకు , దీర్ఘకాలిక వ్యాదులతో సతమతం అవుతున్న రోగులకు ఆర్థిక స్థోమత లేని వారికి ఈరోజు ల్లో మానసిక ప్రశాంతత కంటే సంపూర్ణ ఆరోగ్యం లేదని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ప్రభుత్వ ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు , ఆత్మీయ పకరింపు , సేవ , ఆదరించే విధంగా ఆరోగ్య సేవలు , ఇక్కడే పౌష్టికాహారం , జావా లాంటివి ఇచ్చే గొప్ప కార్యక్రమం ఆలనా కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.. చివరి శ్వాస లో కూడా వారి మానసికంగా మనోధైర్యం ఇవ్వడం కంటే గొప్ప ఆరోగ్యం లేదని మంత్రి చెప్పారు.. అలాంటి గొప్ప సేవా భావం నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగడం సంతోషంగా ఉందన్నారు.. ఇది పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు..