– సిద్దిపేట వైద్య కళాశాల మరిన్ని పీజీ సీట్లు..
అనతి కాలంలోనే సిద్దిపేట వైద్య కళాశాల అరుదైన గుర్తింపు..
– మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట వైద్య కళాశాలకు 57 పీజీ సీట్లు …
– అన్ని కోర్సు లు ఈ విద్యాసంత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభం.
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 11( జనం సాక్షి )తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న సందర్భం ..ఒక వైపు ప్రభుత్వ ఆసుపత్రి బలోపేతం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం , మరో వైపు వైద్య విద్యను ప్రోత్సాహించే దిశగా జిల్లాకో మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు కాబోతున్నాయి.. మంత్రి హరీష్ రావు ప్రత్యేక కృషి తో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చాక జిల్లా ఏర్పడ్డగా తొలి దశలో సిద్దిపేట వైద్య కళాశాల ను మంజూరు చేసారు.. వైద్య కళశాల ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు సిద్దిపేట లో ప్రభుత్వ వైద్య సేవలు అందించడం లో ఆదర్శంగా నిలుస్తున్నది…మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తో వైద్య కళాశాల రెండు ఏళ్లలోనే పూర్తి చేసుకొని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చుకోవడం జరిగింది.. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో నే పీజీ కోర్స్ లు ఏర్పాటు చేయలన్న మంత్రి హరీష్ రావు సంకల్పం తో సిద్దిపేట లో పీజీ సీట్లు మంజూరు అయ్యాయి.
– ఆనతి కాలం లోనే అరుదైన గుర్తింపు..
సిద్దిపేట వైద్య కళాశాల ఏర్పడ్డ అనితి కాలం లోనే పీజీ సీట్లు రావడం గొప్ప సందర్భం.. నేషనల్ మెడికల్ కమిషన్ కు 11 కోర్స్ లో 57 సీట్లు పూర్తి స్థాయిలో మంజూరు అయ్యాయి.. వైద్య కళాశాల ఏర్పడ్డ కొద్దీ రోజుల్లోనే పీజీ కు అనుమతి రావడం అందులో అన్ని కోర్స్ లకు అవకాశం రావడం ఇది అరుదైన గుర్తింపు గా చెప్పుకొవచ్చు..
– వైద్య విద్యకు కృషి..
సీఎం కేసీఆర్ నాయకత్వం వైద్యం..మరో వైపు వైద్య విద్యకు పెద్ద పీఠ వేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు.. ఇటివల 95 % స్ధానికులకె వైద్య సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తోసుకుందన్నారు.. సిద్దిపేట వైద్య కళాశాల కు ఒకే సారి అన్ని పీజీ కోర్స్ లకు అనుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.. పీజీ చదివేందుకు ఎక్కడికో వెళ్లే అవకాశం లేకుండా ఇక్కడే పీజీ పూర్తి చేసే దిశగా వైద్య విద్యను ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.. ఈ విద్యా సంవత్సరం నుండి ఇప్పుడు జరిగే కౌన్సిలింగ్ లో సిద్దిపేట మెడికల్ కళాశాల లో 57 పీజీ సీట్లకు అప్షన్ ఉంటుందని చెప్పారు.. సిద్దిపేట లో పీజీ కోర్స్ లు చేయాలనే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు..పూర్తి స్థాయిలో లో కోర్స్ లు రావడానికి కృషి చేసిన వైద్య కళాశాల డైరెక్టర్ , మరియు అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.