సిపిఎం పార్టీ సభ్యులు కామ్రేడ్ మల్లయ్య అనారోగ్యంతో మృతి
పినపాక నియోజకవర్గం,ఆగస్ట్27,(జనంసాక్షి):-
సిపిఎం పార్టీ సభ్యులు కామ్రేడ్ పాయం మల్లయ్య (85) అనారోగ్యంతో పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ సాయి నగర్ లో శనివారం మృతి చెందారు.వా మృతి పట్ల సిపిఎం మండల కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది.వారు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న మాట్లాడుతూ
సిపిఎం పార్టీ సభ్యులు కామ్రేడ్ పాయం మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందటం పార్టీకి తీరనిలోటని అన్నారు. 2007 సంవత్సరం నుండి ఇప్పటివరకు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు.అనేక ప్రజా సమస్యలు తీర్చడంలో,భూ పోరాటాలలో ఆయన చేసిన ఉద్యమం మరవలేనిదన్నారు. పేదరికం వెంటాడుతూ ఉన్న అనారోగ్యం బారిన పడ్డ ఆత్మవిశ్వాసంతో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడారన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.ఈ నివాళి కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, నట్టి శంకరయ్య,శాఖ కార్యదర్శిలు కురసం లక్ష్మయ్య, పాయం శంకర్,ధారం లక్ష్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు మీసాల సమ్మక్క పాల్గొన్నారు