సిపిఎస్ రద్దు హావిూ ఇచ్చిన పార్టీలకే ఓటు
వరంగల్,అక్టోబర్10(జనంసాక్షి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను పునరుద్ధరించే పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల మద్దతు ఉంటుందని టీపీటీయూ (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్) జిల్లా నాయకులు స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ శాపంగా మారిందని వాపోయారు. సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లేలా మారిన నూతన పింఛను విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్ రద్దుకు స్పష్టమైన వైఖరితో ఉన్న నాయకులకే మా మద్దతు ఉంటుందన్నారు. స్నేహపూర్వక ప్రభుత్వంగా చెబుతూ విస్మరించడం సరికాదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల చివర్లో జాక్టో, యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.