సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందే

పోరాటాలకు మద్దతు ఇస్తాం:ఎమ్మెల్సీ కత్తి

కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయం ప్రకటించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఏడు
రోజులు సిపిఎస్‌పై పిడిఎస్‌ ఎమ్మెల్సీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా పిఎఫ్‌ సౌకర్యం కల్పనకు ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. డిసెంబర్‌ 31 లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిఒ
నెంబర్‌ 29 ప్రకారం కొత్త ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి డిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 30 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు యుపి స్కూళ్లకు ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరుతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
తెస్తున్నామన్నారు.