సిమ్లాలో ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు
అనంతపురం,అక్టోబర్23(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు, విద్యా వ్యాపారీకరణకు, కాషాయీకరణకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు చేయాలని నిర్ణయించింది. హిందూపురంలోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ దేశంలోని విద్యార్థి లోకాన్ని చైతన్యవంతం చేయడానికి, పోరాటం చేయటానికి మహాసభలు, తీర్మానాలు రూపొందించడానికి ఈ నెల 30 నుండి నవంబర్ 2 వరకు సిమ్లాలో, ఎస్‌ఎఫ్‌ఐ 16 వ ఆఖిల భారత మహాసభలు నిర్వహించనున్నామని ప్రకటించారు. కరువు జిల్లాలో ఉన్న విద్యారంగం సమస్యలతో పాటు ఈ ప్రాంతం వెనుకుబాటుతనానికి, వివక్షతకు కారణమైన అంశాలపై మహా సభలలో చర్చించనున్నామన్నారు. చర్చించడానికి, తీర్మానాలలో ప్రతిపాదించడానికి కఅషి చేస్తామని తెలిపారు. ఈ మహా సభ జయప్రదానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, డివిజన్ నాయకులు జయచంద్ర మహేష్, మాధు, రూపేష్, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.