సిసి రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ
నారాయణఖేడ్ జులై 16 ( జనంసాక్షి )
నారాయణఖేడ్ పట్టణంలోని భూమయ్య కాలనీలో రూ.6 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రాయినులు నిర్మాణం సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా నిధులతో నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. శనివారం నారాయణఖేడ్ పట్టణంలోని రామ మందిర నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు. రామమంది నిర్మాణాన్ని కోసం దేవదాయ శాఖ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేసిందని, దాతల సహకారంతో రూ.10లక్షలు భాగస్వామ్య మొత్తాన్ని చెల్లించిన పక్షంలో రూ. 50 లక్షల నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. రూ. 2 లక్షలు విరాళంగా ఇస్తామని, మిగతా మొత్తాన్ని సేకరించి దేవదాయ శాఖకు చెల్లించిన పక్షంలో నిధులు విడుదలవుతాయన్నారు. ఈ మేరకు నూతనంగా నిర్మించనున్న రామ మందిరం కోసం సిద్ధం చేసిన మ్యాప్ ను ఎమ్మెల్యే వారికి చూపించారు. వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. ఆలయ స్థల పరిరక్షణ కోసం చేపట్టిన ప్రహరీ నిర్మాణంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు యువకులు చేసిన కృషిని ఎమ్మెల్యే అభినందించారు. క రూసుగుత్తి రోడ్డు ప్రాంతంలో కాశి విశ్వనాథ స్వామి ఆలయం స్థలములను దుకాణ సముదాలకు వినియోగించే విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెరాస నాయకులు రోషన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎo, ఏ నజీబ్,రవీందర్ నాయక్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.



