సీఎంఓ కార్యదర్శి ని కలిసిన రిటైర్డ్ కార్మికులు..

సీఎంఓ కార్యదర్శి ని కలిసిన రిటైర్డ్ కార్మికులు..

హైదరాబాద్ లో తెలంగాణ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి గతం లో సింగరేణి, కోల్ ఇండియా చైర్మన్ గా పని చేసిన ఎస్.నర్సింగ్ రావు ఐఎఎస్ కి సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలపై మెమోరాండం సమర్పించారు.
1.పెన్షన్ పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.దీనికి గాను కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలి.

2.రిటైర్డ్ కార్మికుల నుంచి 40,000 రూపాయల సిపిఆర్.ఎం.ఎస్ పథకం రద్దు చేసి ప్రతి రిటైర్డ్ కార్మికుని అన్ని రకాల అపరిమిత వైద్య సేవలు కల్పించాలి. వసూలు చేసిన నగదు తిరిగి చెల్లించాలి.

3.సింగరేణి లాభాల వాటలో 10%రిటైర్డ్ కార్మికుల కూడా చెల్లించాలి.

4.ఓ.ఎం.జి.సి కంపనీలో రిటైర్డ్ కార్మికులకు అమలు అవుతున్న నగదు పథకాన్ని సింగరేణి రిటైర్ కార్మికులకు కూడా ప్రవేశపెట్టాలి. ఆ కంపనీ లాగే సింగరేణి కూడా లాభాలు గడిస్తుంది.

5.సింగరేణి రిటైర్డ్ కార్మికులు అత్యధికంగా నివసిస్తున్న హైదరాబాద్, జమ్మికుంట మొదలైన ప్రాంతాల్లో సింగరేణి మెడికల్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా నెలవారి మందులు ఇవ్వాలి.

6. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే “ఆసరా”పెన్షన్ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు చెల్లించాలి.
ఈ కార్యక్రమంలో కోల్ మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కె.ఆర్.సి.రెడ్డి, ఎం.బాబు రావు, ఏనుగు రవీందర్ రెడ్డి.ఆళవందార్ వేణు మాధవ్, పి.టి.స్వామి తదితరులు పాల్గొన్నారు.