సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయలు మంజూరు.
-రేగా కి చేతులెత్తి మొక్కుతున్న లబ్ధిదారుడు.
పినపాక, సెప్టెంబర్ 7(జనంసాక్షి):-
కరోనా కోరలు చాచి తన పంజా విసురుతున్న సమయంలో మరణపు మంచం నుండి బయట పడ్డ అదృష్టవంతుడు ఆ నవ యువకుడు. విషయం పూర్వపరాలలోకి వెళితే
పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన బత్తుల నందకుమార్ కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం జరిగింది.
ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆసుపత్రిలో వెచ్చించిన లక్షల రూపాయల సొమ్ము అప్పుగా కనబడడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావు కి జన్మజన్మల రుణపడి ఉంటామని భక్తుల నందకుమార్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైన ఆనందభాష్పాల నడుమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఆసుపత్రిలో ఖర్చు ఐనా సొమ్ము నిమిత్తం ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విశేష కృషి చేసినందుకు తమ కుటుంబం తరపున రేగా కాంతారావుకి జన్మజన్మల రుణపడి ఉంటామని చేతులెత్తి మొక్కుతున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును అతి త్వరలో రేగా కాంతారావు చేతుల మీదుగా నందకుమార్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా బతుల నందకుమార్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో ఆపదలో ఉన్న వెంటనే ఆదుకునే మంచి మనసున్న మారాజు ఎమ్మెల్యేగా దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును త్వరలోనే ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా అందుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు.